Skip to content
loyalties.space
Cart0
Back to the book

Bharat Shelf

ప్రబంధసంబంధబంధనిబంధనగ్రంథము

Mandapaka Parvateeswara Sastry · 1896

ప్రబంధసంబంధబంధనిబంధనగ్రంథము - వికీసోర్స్ Jump to content ప్రధాన మెనూ ప్రధాన మెనూ సైడ్‌బార్‌ లోకి తరలించు దాచు మార్గసూచీ మొదటి పేజీ సముదాయ పందిరి రచ్చబండ ఇటీవలి మార్పులు ఇటీవలి మార్పులు(సహాయంకోరిన) రచయితలు యాదృచ్ఛిక రచన యాదృచ్ఛిక రచయిత యాదృచ్ఛిక పాఠ్యీకరణ సహాయం Display Options వెతుకు వెతుకు స్వరూపం విరాళాలు ఖాతా సృష్టించుకోండి లాగినవండి వ్యక్తిగత పనిముట్లు విరాళాలు ఖాతా సృష్టించుకోండి లాగినవండి ప్రబంధసంబంధబంధనిబంధనగ్రంథము భాషలను చేర్చు లంకెలను చేర్చండి పేజీ మూలము చర్చ తెలుగు చదువు సవరించు చరిత్ర పనిముట్లు పరికరాలు సైడ్‌బార్‌ లోకి తరలించు దాచు చర్యలు చదువు సవరించు చరిత్ర సాధారణం ఇక్కడికి లింకు చేస్తున్నవి సంబంధిత మార్పులు శాశ్వత లంకె పేజీ సమాచారం ఈ పేజీని ఉల్లేఖించండి పొట్టి URL ని పొందండి Print/export Download as PDF అచ్చుతీయదగ్గ కూర్పు ఇతర ప్రాజెక్టులలో వికీడేటా అంశం స్వరూపం సైడ్‌బార్‌ లోకి తరలించు దాచు Download వికీసోర్స్ నుండి ప్రబంధసంబంధబంధనిబంధనగ్రంథము (1896) రచించినవారు మండపాక పార్వతీశ్వర శాస్త్రి 122432ప్రబంధసంబంధబంధనిబంధనగ్రంథముమండపాక పార్వతీశ్వర శాస్త్రి1896 ​ శ్రీశ్రీధరాయనమః శ్రీబొబ్బిలి పురాధీశ్వరులగు, మహారాజరాజశ్రీ శ్రీ వేంకట శ్వేతాచలపతి రంగారావు బహద్దరుగారి యాస్థాన విద్వత్కవులలో నొకరగు బ్రహ్మశ్రీ మండపాక పార్వతీశ్వరశాస్త్రులవారిచే రచియింపఁబడిన ప్రబంధసంబంధబంధనిబంధనగ్రంథము ఇది శ్రీ "అముద్రితగ్రంథచింతామణి" యందుఁ బ్రకటింపఁబడుటకై గ్రంథకర్తవలనఁ బంపబడి శ్రీమత్సరస్వతీనిలయ ముద్రాక్షరశాలయందు ముద్రితమై యముద్రితగ్రంథచింతామణి పత్రికాధిపతియగు పూండ్ల రామకృష్ణయ్యగారిచేఁ బ్రకటింపఁబడియె. శ్రీమత్సరస్వతీనిలయ ముద్రాక్షరశాల, నెల్లూరు. 1896. వెల, రు.0-4--0 ​ఛత్రబంధాంతర్గతశతబంధనామావళి సీసమాలిక.⁠ శ్రీశతరుద్రీయసిద్ధాంతితంబగు విశ్వరూపము గల్గి వెలయుచున్న విశ్వేశ్వరునిమూర్తి వీక్షింప దీక్షించి తల్లిదండ్రులఁ గూడి తత్పురంబు నకుఁ బ్రమాదీచనామకవత్సరంబున నరుగుచు మార్గమధ్యంబునందు బంధగర్భకవిత్వబంధురంబుగ నే రచించిన యనవద్యసీసపద్య శతకంబునందలి ఛత్రబంధంబున నిమిడిన నూఱుబంధముల వినుఁడు పద్మకోశాంకుశ పరశుఖట్వాంగత్రిశూలకాసారక పాలఖేట మల్లాయుధవిశేష మణిశాణపట్టికా మద్గరోలూఖల ముసలతర్కు తాఘాయోగదండతులాతులాయన సందంశకర్తరీ శలభ కలభ శరచాపహలకుంత చామరవీజన డమరకురంగ ఘంటానిషంగ కమఠనాగస్వర కాహళవల్మీక దండకమండలు దరమయూర డోలికామాలికాందోళికా శిబికాగళంతికా గణికా కళాచికా వి పంచికాకుంచికా పాదుకాకనకాలుకోర్మికాహార కేయూరమకుట వీటికాపేటికా వృషవైజంతికా నాసికాముకుర దీనారకుతుప కాలచక్రతరీకులాలచక్రాదర్శ శఫర గదా తాళ శకట ఖడ్గ సింహాసనోపాంగ చిత్రవితాన బిల్వదళోపధాన గవాక్షకేళి జలశృంగవాశికా షట్పంచకోణాహి సవ్యౌత్తరగ్రహచక్రపన్న గాభరణవరాభయప్రదముద్రాపటీరకుటీరాల్పశారిఫలక యాత్రికద్విశరశరాసనైకాదశరుద్రమండలవిమానాద్రిధూప దీపనీరాజనాష్టపదమంత్రపుష్పప్రదక్షిణనమస్కారబంధ ము లనంగ శతబంధముల గల వింకను బుద్ధిమంతులు సూక్ష్మబుద్ధిచేత గల్పించినకొలంది గడువిచిత్రములైన బహుబంధములుగను పట్టునిందు నివిగా ప్రాచీనకవు లేర్పఱచిన మార్గమున నవీనమార్గమున నిపుడు పద్మబంధము నాగబంధము చక్రబంధము గ్రహచక్రబంధము మృదంగ బంధము సర్వతోభద్రబంధము సౌధబంధము కంకణబంధ లింగ బంధ నిశ్రేణికాబంధ గోమూత్రికాబంధంబులు తులసీబంధ పుష్ప ⁠ ​ ⁠ మాలికాబంధముల్ మఱియును లఘుసుదర్శనబంధ గురుసుదర్శ మహాసు దర్శనబంధత్రితయము ముప్పదిరెండుదళముల పద్మబంధం బనంగ నెగడు బంధములు గొన్ని “ప్రబంధసంబంధనిబంధనగ్రంథ”మందుఁ దెలిపినలక్షణంబులకు లక్ష్యములుగా గురుకటాక్షమున నేఁ గూర్చినాఁడ నిది పూర్వభాగ మిట్లింక నుత్తరభాగమున బంధలక్షణముల నొనర్తు లక్ష్యలక్షణములు లలితబంధముల క్రింద లిఖించి కనువారి కెలమిఁ గొలుపు విద్యాభమాను లవ్విధమున ముద్రింపఁబూనినచోఁ బంపఁబూనియుంటి లాక్షణికులార దోషంబులకు సహించి గుణముల గ్రహించి మన్నింపఁ గోరుచుం సంతతాన్యోన్యసామరస్యము నొసంగి మనల దయచేతఁ బురజేత మనుచుఁగాత. ⁠ ఇట్లు మండపాక పార్వతీశ్వరశాస్త్రి ​ శ్రీరస్తు శ్రీ కాశీవిశ్వనాథాయ జగద్గురు గణపతయేనమః మండపాక పార్వతీశ్వరకవీశ్వర కృతమగు ప్రబంధసంబంధబంధనిబంధనగ్రంథము పూర్వపీఠిక క.⁠ శ్రీరసికు లెన్న బంధో ద్ధార మొనర్పఁదగు నేర్పుఁ దనకుంబలె నా కారూఢిం గలిగించిన కారుణ్యమయాకృతిన్ జగత్పతి నెంతున్. ⁠ 1 సీ.⁠ శ్రీమత్పినాకినీసింధుతీరమున భాసిల్లు నెల్లూరిలో నుల్లసిల్లు పూండ్లవంశంబునఁ బొడమి యీపుడములోఁ గవిపక్షపాతియ న్ఖ్యాతి వడయఁ గడఁగి యముద్రితగ్రంథచింతామణియను పత్రికను బ్రకటన మొనర్చు శ్రీరామకృష్ణాఖ్యచేఁ దనర్చు నుదారకవి గోరి వ్రాసినకారణమున ⁠ గీ.⁠ మహితబొబ్బిలిపురి నుండు మండపాక పార్వతీశ్వరకవి కతిపయకవిత్వ బంధముల కొకలక్షణగ్రంథ మిపుడు క్రొత్తగా నేర్చిన ట్లొనగూర్చె నిట్లు ⁠ 2 చ.⁠ సుకవులు బంధలక్ష్యములె చూపిరి గాని తదర్హలక్షణం బొకరును జూపరైరని తదుద్ధరణార్థము పూండ్ల రామకృ ష్ణకవి దృఢప్రతిజ్ఞుఁడు రసజ్ఞుఁడు గావునఁ బూనియుండెఁ గౌ తుకమునఁ బార్వతీశ్వరుఁడు దోడ్పడఁ దత్ఫలసిద్ధి కబ్రమే. ⁠ 3 చ.⁠ కవులు నిరంకుశప్రతిభ గల్గినవా రగుటన్ స్వతంత్రులై వివిధవిచిత్రబంధములు వృత్తనిబంధము లేక క్రొత్తక్రొ త్తవి దమచిత్తవృత్తియె నిదానముగా మును గూర్చి రైన సూ క్ష్మవిధి నొనర్తు లక్షణము మత్కృతలక్ష్యపురస్సరంబు గాన్. ⁠ 4 చ.⁠ అమలమతుల్ వినుం డొకరహస్యముఁ దెల్పెద సంప్రదాయసి ద్ధములగు కొన్నిబంధములుదప్పఁ దదన్యము లెప్పుడైనఁ గ ర్తృమహిమ నించుమించులగు నిట్టినిమిత్త మెఱింగి నాదుపొ త్తముఁ గను నప్పు డిప్పు డిది తప్పని తప్పని దెప్పఁబోకుఁడీ. ⁠ 5 ఉ.⁠ నాల్గుతెఱంగులైన కవనంబున బంధకవిత్వ మన్నిటం దెల్గునఁ గూర్చు టెన్నిటను దీరనికష్టము తద్విశిష్టరే ఖ ల్గడముట్టునట్టు లొకకట్టడ పుట్టకయున్న నున్నబి ట్ట ల్గనుపట్టు నెట్టని కడంగి తొడంగితి దీనిఁ జేయఁగాన్. ⁠ 6 ఉ.⁠ చిన్నతనంబునందె పితృసేవ యొనర్చుచు వారణాసిఁ గొ ల్వన్నడతెంచుచుం బ్రకృతిబంధవిముక్తికిఁ జిత్రబంధముల్ మున్న విముక్తనాయకుఁడు మోదిలఁగూర్చితి నాటిబంధము ల్గొన్ని యుదాహరింతు నిఁట లోపము లున్నను సైఁపుఁ డున్నతుల్. ⁠ 7 క.⁠ లక్షణము లేనివానికి లక్షణము లభించెనని తలంచి యపేక్షన్ లాక్షణికులు వీక్షింతు ర సూక్షణకు లుపేక్ష గలిఁగి చూడకయున్నన్. ⁠ 8 ​ గీ.⁠ నలినబాంధవ కుముదబాంధవులఁ గూడి తార లెందాఁకఁ దనరు నందాఁక మత్ప్ర బంధసంబంధబంధనిబంధనంబు చిత్రకవనానుబంధమై చెలఁగుఁగాత. ⁠ 9 మత్కృత శ్రీకాశీవిశ్వనాథశతకమునందలి నిరోష్ఠ్యబంధశతగర్భితచ్ఛత్రబంధబంధురసీసపద్యము ⁠ బ్రేమ నస్మద్భవాతపపీడ లడఁప దర్శనం బిమ్ము సీసపద్యగనిరోష్ఠ్య బంధశతగర్భితచ్ఛత్రబంధముఁ గొని కాశికావిశ్వనాథదుర్గాసనాథ. ⁠ ఈసీసపద్యమందున్న నిరోష్ఠ్యబంధశతగర్భితచ్ఛత్రబంధశ్లోకము శ్లో.⁠ రాకరాకత్రిరాకారా రాజతాగగతాజరా రాగాసారరసాగారా రాకారాత్రికరాకరా ⁠ (ఇందలి బంధశతంబును, దీనియర్థంబును, గడపట వ్రాయంబడును. లక్ష్యముగా మాత్ర ముదాహరింపఁబడియె.) బంధలక్షణప్రకరణము (ఛత్రబంధలక్షణము) చ.⁠ ప్రథమచతుర్థపాదముల వ్రాలనులోమవిలోమగామితా గ్రథితము లున్నరెండును సగంబునకే భ్రమకంబు లిట్లవి శ్లథవిధి నుండ దండమున ఛత్రమునం గ్రమతన్ లిఖింపఁగాఁ బృథివిని ఛత్రబంధమగు వృత్తము చిత్తమురీతిదే యగున్. ⁠ 1 ​చామరబంధలక్షణము చ.⁠ తొలియడు గిందునం దరయఁ దుల్యము పద్భ్రమకత్వము న్నయం ఘ్రులకు సగంబునంద యొడఁగూడును దీనికి బఙ్క్తు లాఱు పై యలుఁగున ఖడ్గబంధమున కంఘ్రులు మూడును నాల్గుబంతులౌ సలుపుదు రిట్టికీ లెఱిఁగి చామరబంధము చామరాదులన్. ⁠ 2 ఖడ్గబంధలక్షణము మ.⁠ పిడికా దిందుది నాల్గునాల్గుదళముల్ పీఠాకృతిన్ నిల్పి యొ క్కడుగం దల్గునఁ దచ్ఛిరోక్షరమె యాద్యంబంత్య మౌనట్లు పై యడుగుల్ మూడును నాల్గుబంతులుగ వ్రాయన్ ఖడ్గబంధం బిదే పుడమిన్ నేర్పరి గూర్పఁ జిత్రగతులం బొందున్ సుగంధ్యాదులన్. ⁠ 3 పద్మబంధలక్షణము మ.⁠ నలసంజ్ఞల్ దళసంఖ్య నొప్ప దళవర్ణశ్రేణితోఁ గర్ణికా తలవర్ణంబు లగించు చొప్పొకటి లేదా స్రగ్ధరాద్యంతది గ్దళవరాళిప్రవేశనిర్గమనసాధారణ్య మొందన్ విది గ్దళవర్ణంబులఁ గూడి యష్టదళసంజ్ఞం బద్మబంధం బగున్. ⁠ 4 గ్రహచక్రబంధలక్షణము మ.⁠ అపసవ్యగ్రహచక్రమందు గ్రహనామైకైకముఖ్యాక్షరం బుపయోగార్హముగాఁ గనంబడినటుల్ యోజించి పద్యాంఘ్రిగ ర్భపరీతంబుగఁ జేసియో వసుదళాబ్జంబట్లు సంధించియో యుపలబ్ధిన్ గ్రహచక్రబంధము బుధుఁ డూహించి కూర్పందగున్. ⁠ 5 ఇదే యష్టదళపద్మబంధంబునకుఁ బక్షాంతరలక్షణం బగు. నాగబంధలక్షణము మ.⁠ సరిగా నల్ నవకోష్ఠముల్ నెఱపి లో సందంశరీతింబర స్పరరేఖల్ గదియించి పార్శ్వము లథోభాగంబుకోణంబులుం బరివేష్ఠిపఁగఁ జుట్టి పుచ్ఛముఖముల్ ప్రాగ్రేఖలం దీర్చి స్ర గ్ధరయో చంపకమాలయో యొగినిడంగా నాగబంధం బగున్. ⁠ 6 పుష్పమాలికాబంధలక్షణము ఉ.⁠ సంధి నొకక్షరంబు నలుచక్కులఱేకుల నాల్గువర్ణముల్ సంధిలునట్లు స్రగ్ధరయొ చంపకమాలికయో మిధోగ్రసం బంధము గల్గు తత్కుసుమమండలి లోనిడఁ బుష్పమాలికా బంధ మగుం బ్రతిప్రసవవర్ణము లేడగుం గూడఁబల్కినన్ ⁠ 7 చక్రబంధలక్షణము మ.⁠ పయిపైఁగాఁ బదిచుట్లు నాఱుదళముల్ ప్రాగ్రేఖలం దీర్చి స్వా హ్వయపత్యాహ్వయముఖ్యచిహ్నములు గన్పట్టంగఁ బాదత్రయా శ్రయరేఖాంత్యపదాశ్రయాదివృతిగా శార్దూలవిక్రీడితా హ్వయవృత్తంబు యథాక్రమంబుగ లిఖింపం జక్రబంధం బగున్ ⁠ 8 సర్వతోభద్రబంధలక్షణము మ.⁠ క్రమరీతిం జతురంగచక్రమున నర్థశ్రేణుల దర్థప ద్భ్రమకంబై ప్రథమాంఘ్రివర్ణము లథఃపాదాదులం దుల్యసం ఖ్యముగాఁ గల్గినదై సగంబు తలక్రిందై సర్వతోభద్రబం ధమగుం బొందిక దీని కెన్మిదవచందం బెన్నచందంబులన్ ⁠ 9 ​సౌధబంధలక్షణము చ.⁠ ఒకటియు మూడు మూ డొకటి యోలిగ మీదను గ్రిందం గూర్చి త్రి త్రికములు సంధియుగ్మమునఁ దీర్చి చతుశ్శివధామభూమికా త్రికము పొనర్చి గర్భమునఁ గ్రేవలగందముఁ గ్రిందుగా నమ ర్చి కవుల సౌధబంధమునఁ జేర్చి రచింతురు సీసపద్యమున్ ⁠ 10 గోమూత్రికాబంధలక్షణము మ.⁠ కుటిలంబై పొడవై మిధోభిముఖమౌ గోమూత్రరేఖాకృతి స్ఫుటరేఖాద్వయి రెండుగీట్లనడుమం బొందించియో లేక త త్పటురేఖాంతరగేహపఙ్క్తియుగళిన్ వ్రాల్నింపి యొండొంటఁ బ ల్కుట కర్హంబుగనో ఘటింతురు కవుల్ గోమూత్రికాబంధమున్ ⁠ 11 ఆందోళికాబంధలక్షణము మ.⁠ క్రమవక్రంబులుగాఁ గ్రమేళకముజోకన్ దండఖట్వాదిరూ పములున్ సంధులయందుఁ జిత్రకలశద్వంద్వంబు పూబంతిమ ధ్యమునందుం దలక్రిందుగాఁ జదువ నర్హంబైనపద్యంబు హృ ద్యముగా నందునుఁ జేర్చి కూర్చుఁ జతురుం డాందోళికాబంధమున్ ⁠ 12 శిబికాబంధలక్షణము శా.⁠ బంధజ్ఞానము లేనివారు శిబికాబంధంబె యాందోళికా బంధం బందురు గాని నామమును రూపం బేకరూపంబులో సంధింపంబడు శ్లోక మేకమయినన్ సంధానసంస్థానసం బంధం బేకము గాదు గావునఁ బృథగ్బంధంబు లౌటబ్రమో ⁠ 13 మురజబంధలక్షణము చ.⁠ అరచదరంగపుంగదుల నంఘ్రులు నాల్గును ద్విత్రిషణ్నగా క్షరములొ మధ్య షట్కమొ యొకండుగ నుండఁగఁ గూర్చి వ్రాయఁగా మురజసమాఖ్యబంధ మగు మూలకు మూలకు రేఖ లుంచి పై తెరువున వ్రాసిచూచిన నదే యగు రెంటను గామగామియై ⁠ 14 కంకణబంధలక్షణము చ.⁠ కవి యొకదానిలో నొకటిగా వలయాకృతిగా ద్విరేఖలం గవియునటుల్ ఘటించి కడఁకం గడియంబున నాద్యమంత్యమో యవు నొకపద్య ముంచ నది యక్షరసంఖ్య నితస్తతోగతిం దివియ ననేకరూపు లగు దీనిన కంకణబంధ మం డ్రిలన్ ⁠ 15 పద్మకోశబంధలక్షణము ఉ.⁠ నాళమునందె యాదిచరణంబు లిఖించి తదంతిమాక్షరం బోలిగ నాద్యమంత్యమగునోజ ద్వితీయతృతీయపాదముల్ కీలరి కుట్మలంబున లిఖింపఁగ నంతిమ మాదిపాదమం దే లయ మొందుఁ గ్రిందుగ నిదే యలకుట్మలబంధమై చనున్ ⁠ 16 లింగబంధతులసీబంధలక్షణములు చ.⁠ శశిహయసాయకానలనిశాకరవహ్నిశరాశ్వకోష్ఠముల్ విశదముగా నమర్చి యొకవృత్తముందుఁ బొనర్చి కుక్షిలోఁ గుశలకవుల్ నిజేష్ట మొనఁగూర్చి యొనర్చిన లింగబంధమౌఁ బశుపతి కింపుఁగాఁ దులసిబంధ మిదే యగు శౌరి కింపుగాన్ ⁠ 17 ​డమరుబంధలక్షణము ఉ.⁠ ప్రాంశువులైన సత్కవులు భాసురరేఖలు రెండు రెండు సం దంశములీల వ్రాసి వదనంబులు రెండును రెంట మూసి గ ర్భాంశగతాక్షరంబె మొదలై తుదయై తగునట్లు గూర్పఁగా భ్రంశము లేకదే డమరుబంధ మగున్ ద్విముఖానుబంధమై ⁠ 18 ఖేటబంధలక్షణము చ.⁠ అలరులు నాల్గు నాల్గు వలయంబున గర్భమునన్ లిఖించి య య్యలరుల నాద్యమంత్య మగునంఘ్రులు రెండును ముష్టిబంధన స్థలముల నున్న యంఘ్రులును దద్గతవర్ణము లాదులంతిమం బులు నగున ట్లమర్చి సలుపుం గని యీగతి ఖేటబంధమున్ ⁠ 19 తరవారిబంధలక్షణము చ.⁠ తుదమొద లల్గునం బ్రథమతుర్యపదంబుల కాదిఁజేసి పై పదములు జాళువామొసలినా పిడికట్టున జట్టుగా సగం బదియిది సొచ్చి వచ్చి పిడికల్గునకుం గల సంధి వర్ణమం దొదుగునటుల్ ఘటింతు రిటు లుర్విఁ గవుల్ తరవారిబంధమున్ ⁠ 20 త్రిశూలబంధలక్షణము శా.⁠ ఏమై మమ్మొనవాలుగా నలరు నట్లే రేఖలం దీర్చి యం దామూలాగ్రముగాఁగ నాళమున నాద్యంబుం దదంత్యాక్షరం బామూలాగ్రము లొంద శాఖలను మధ్యాంఘ్రుల్ చతుర్థాంఘ్రిక్రిం దై ముఖ్యాంఘ్రినిఁ జేర్చి కూర్చినఁ ద్రిశూలాకారబంధం బగున్ ⁠ 21 పరశుబంధలక్షణము శా.⁠ చేపట్టందగు కాండమం దొకటి తచ్ఛీర్షంబునన్ నల్మొనల్ చూపట్టందగు ఖడ్గమందు భయమున్ సొంపొంద సంధ్యాదిగా వేపట్టందగు తుర్య మాద్యపదసంవేద్యంబుఁ గావింత్రు మే ధాపాథోనిధు లీవిధిం బరశుబంధంబుం బ్రబంధంబులన్ ⁠ 22 శరబంధలక్షణము చ.⁠ ప్రథమతృతీయవర్ణములు పార్శ్వములందు ద్వితీయ మగ్రమం దధిగతమౌగతిన్ నిలిపి యమ్మునఁ బూర్వపదమ్ముఁ గూర్చి త త్ప్రథమపదంబునం జరమపాదముఁ గ్రిందుగఁ జేర్చి యల్గునన్ బుధుం డిరుచోట్లనున్నపదముల్ వెరపన్ శరబంధమై తగున్ ⁠ 23 చాపబంధలక్షణము చ.⁠ చిలుకున నాదిపాద మిడి సింగిణిశింజిని చిల్కుతోడ సం ధిలిన దళంబు లాదిని దుదిం దగుచందమునన్ ద్విపాదము ల్నిలిపి చతుర్థ మాదిపదలీనముగా నొనరించి యీగతిం జలిపినఁ జాపబంధ మగు సంగతి మార్చిన మార్చగాఁ దగున్ ⁠ 24 తూణీరబంధలక్షణము శా.⁠ గోపీచందనరేఖలట్లు శరయుక్తూణాకృతిన్ వ్రాసి త ద్రోపాగ్రంబులు తన్ముఖస్థలము తద్రూపద్విపార్శ్వంబు ల య్యైపాదంబుల నొందఁ దుర్యచరణ బాద్యాంఘ్రిలోఁ గ్రిందుగాఁ దోఁపన్ దీపితరీతి నిట్లు సలుపం దూణీరబంధం బగున్ ⁠ 25 ​ఉలూఖలబంధలక్షణము చ.⁠ భ్రమపడఁబోకుఁడీ డమరుబంధ ములూఖలబంధ మొక్కచం దమునఁ దనర్చునంచు నభిధానము వర్ణవిధానముం బ్రధా నముగఁ బ్రధానిధానములు నవ్యకవీశ్వరకావ్యసంవిధా నము విధిసన్నిధానసృజనప్రణిధానము చింత లెంతయున్ ⁠ 26 ముసలబంధకుంతబంధలక్షణములు చ.⁠ ముసలమునందు మధ్యపదముల్ కొసబంతులు రెండు కుంతమం దు సరిగ నాల్గు ప్రాథమికతుర్యపదంబు లితస్తతోగతిం బొసఁగును రెంటిదంటులను బుద్ధికొలందిఁ జమత్కరించి యీ పస నెసఁగించినన్ ముసలబంధ మగుం దగుఁ గుంతబంధమున్ ⁠ 27 అంకుశబంధలక్షణము శా.⁠ కాండాదిప్రసవంబునందును దదగ్రంబందుఁ బూర్వాంఘ్రియుం గాండాగ్రాక్షర మాద్యమంత్యముగ ఖడ్గంబందు వక్రాసియం దండన్ రెండును దుర్యమాదిపదమందగ్రాదియై క్రిందుగాఁ గాండంబందును బొందు నంకుశపదాంకంబైన బంధంబునన్ ⁠ 28 పతాకాబంధలక్షణము శా.⁠ స్తంభాకారమునందుఁ బ్రాక్చరణముం దత్రత్యవర్ణంబు లా రంభంబంతము నౌనటుల్ ధ్వజపటాగ్రం బట్ల యౌనట్లు త చ్ఛుంభత్పార్శ్వములందు మధ్యపదముల్ శ్లోకాంత మాద్యాంఘ్రిగా గంభీరాశయు లి ట్లొనర్తురు పతాకాబంధ మందంబుగాన్ ⁠ 29 హలబంధలక్షణము మ.⁠ హలకాండంబు యుగంబు సంధిలినచో నారబ్ధమై దాని నే వలగొంచున్ హలమధ్యమందుఁ బ్రథమంబౌ నంఘ్రి మధ్యాంఘ్రు లా హలసంధ్యక్షర మాద్యమంత్యముగ నర్ధావృత్తినం దేకనుం దలక్రిందై ప్రథమాంఘ్రి నొందు హలబంధంబందుఁ దుర్యాంఘ్రియున్ ⁠ 30 దర్పణబంధలక్షణము ఉ.⁠ స్వర్పతిదేశికార్యులగు సత్కవివర్యులు కార్యధుర్యులై నేర్పుఁ దలిర్ప వేర్పఱచి నీరజకోశనికాశరేఖలన్ దర్పణరూప మేర్పఱచి దర్పకదర్పహృదర్పణంబు దృ క్తర్పణముం బొనర్ప నది దర్పణబంధ మగున్ వసున్ధరన్ ⁠ 31 కంకతికా(దువ్వెన)బంధలక్షణము మ.⁠ కృతికర్తల్ కుతుకం బెలర్పఁ దొలుతన్ రేఖాకృతిం దీర్చి మ ధ్యతలహ్రస్వము పర్యధఃక్రమ విశాలాగ్రంబునౌ దానిలో నతిచిత్రంబుగఁ బంచపత్రముల నాద్యంతాంఘ్రులం గూర్చి కం కతికాబంధ మొనర్తురు న్నవిరుప్రక్కల్ ద్రొక్కి సంధిం జొరన్ ⁠ 32 యోగదండబంధలక్షణము ఉ.⁠ ఇంచుక నిమ్న మంచుల నొకించుక నమ్రమునైన మౌళిచే మించిన యోగదండమున మీదుగఁ గ్రిందుగఁ బల్క నర్హతం గాంచుఁ గవాంఘ్రు లున్నవి సగమ్మునఁ గ్రమ్మరివచ్చు నీగతిం బంచిన యోగదండమను బంధ మగున్ రచనాచమత్కృతిన్ ⁠ 33 ​యతిదండబంధలక్షణము ఉ.⁠ గుంపులదండె నొక్కయడుగుం గొనక్రిందుగఁ గట్టినట్టి ప ట్టంపుఁబుటంబుఁ జుట్టుచుఁ గడంగడ ముట్టుచు సంధి నొందు న ట్లింపుగ మధ్యపాదములు నేర్పడఁ దుర్యము నాదిఁ జేర్చి ని ద్దంపురుచిన్ రచింతు రిటు దండికవుల్ యతిదండబంధమున్ ⁠ 34 కమండలుబంధలక్షణము చ.⁠ క్రమముగఁ బూర్వఖండమునఁ బ్రాథమికాంఘ్రియు దానియగ్రవ ర్ణమె మొదటం దుదం బొదల మాళమునన్ సగ మేగివచ్చు పొం కమున ద్వితీయ ముత్తరపుఖండమునందుఁ దృతీయమాదిసా త్మ్యమునఁ దురీయ మొపఁగఁ గమండలుబంధ మగుం గుమండలిన్ ⁠ 35 జపమాలికాబంధలక్షణము ఉ.⁠ మేరుగతాక్షరం బనెడుమేరను మీఱక మీఱు పేరు సం బేరుపదాఱువర్ణములచే జపమాలికపేరిబంధమై హారితఁ గాంచు షోడశదళాంబుజబంధమొ ఛత్రబంధమో యై రుచియించువృత్త మిటులై రచియించుట కర్హతం గనున్ ⁠ 36 గళంతికా(కూజా)బంధలక్షణము చ.⁠ పొడవగు కంఠనాళమునం బూర్వపదం బుదరంబునందు రెం డడుగులు నాల్గుబంతులుగ నంతిమమాదిమమందు మీఁదుఁగాఁ దడఁబడకుండఁ జొప్పడువిధంబునఁ గూర్చి యొనర్చి గనం బడును గళంతికాఖ్యమగుబంధము గ్రంథముల బ్రసిద్ధమై ⁠ 37 అంగుళీయకబంధలక్షణము మ.⁠ సుకవుల్ మెచ్చఁగ షడ్దళాక్షరవృతిన్ శోభిల్లుచున్నట్టి నా యతరత్నాయితవర్ణమాయితముగా నాద్యంతపద్యుక్తిఁ బా యక సార్థభ్రమణత్వ మొంది తగుమధ్యాంఘ్రిద్వయం బంగుళీ యకబంధంబు ననందమొందు జనబృందానందసంధాయియై ⁠ 38 తాడఘాబంధ-తర్కుబంధ-ముద్గరబంధ-వాశీబంధ-కుతుపబంధ-ఖట్వాంగబంధ-కేళీజలశృంగబంధాఖ్యసప్తకలక్షణము ఉ.⁠ తాడఘ సుత్తె పెన్కదురు తర్కువు సమ్మెట ముద్గరం బగున్ బాడిత వాశి తైలఘటవాచకమౌఁ గుతుపంబు మంచపుం గోడు శివాస్త్రభేద మగుఁ గ్రోవి యగున్ జలశృంగ మాఖ్యలం గూడినరూపు లేర్పఱచి కూర్పఁదగున్ శరబంధవైఖరిన్ ⁠ 39 హారబంధలక్షణము చ.⁠ దశదళవేష్టనంబున నథస్స్థలలంబిదళాంతరంబునం గ్రశిమము లేనిమధ్యదళగర్భము న్కొని యాదిమాంతిమాం ఘ్రీశరణ మౌచు హారమణికీలితశిష్టపదంబు వైనచో విశదపుహారబంధ మగు విశ్వవిచిత్రమనోహరాకృతిన్ ⁠ 40 కురంగతురంగమతంగజాదిబంధలక్షణము ఆదిపదముచే ఋక్ష మహోక్ష తరక్షు హర్యాక్షదు లూహ్యంబులు. చ.⁠ “మొగము గనుల్ సెవుల్ మెడయు మూఁపును వీఁపుఁ బిఱుందు లొందుఁ బొం దుగఁ బ్రథమాంత్యముల్” “పదచతుష్టయ మొందును శిష్టముల్ నిజా ⁠ ​ ⁠ ర్థగతుల” నిత్తెఱంగునఁ గురంగతురంగమతంగజాదిబం ధగణము కించిదంచితభిదాగణమై గణుతింపఁగాఁబడున్ ⁠ 41 కాసారబంధలక్షణము ఉ.⁠ తీరచతుష్టయంబున ద్వితీయతృతీయతురీయతీరముల్ సేరిన మధ్యపాదములచేఁ దొలుతీరము సోపనంబులుం జేరిన శిష్టపాదము లదే రహిశృంఖల మేరమీఱి కా సారసమాఖ్యబంధ మగు సారకవుల్ మనసార మెచ్చఁగాన్ ⁠ 42 పాదుకాబంధలక్షణము శా.⁠ ఛత్రాకారకదారుమస్తకతలస్థంబైన వర్ణంబుతోఁ దత్తత్యాంగుళిసంగతార్ణములు ప్రాదక్షిణ్యముం జెంది పా దత్రాణద్వయి నొంది హృద్యమగు పద్యం బేర్పడం గూర్పఁగా ధాత్రింజిత్రతరుంగాఁ దనరుఁ గాదా పాదుకాబంధమై ⁠ 43 కర్తరీబంధసందంశబంధలక్షణము శా.⁠ కీలాద్యగ్రసమాప్తి గాఁగఁ బ్రథమాంఘ్రి న్నిల్ప

Page 1 of 1

Public Domain (Wikisource; Wikidata creator death + pub-year check)

Public-domain text, read inside the house. Position stays on this device.

loyalties.space is the house for book authors: letters, the retail desk, and the launch. President Izno writes Netherfiend. Reviews are never bought. Lists are never rented. The house keeps the letters, the library, and the launch desk.

Amber Kumar, Defence Road, Tilpata Karanwas, Greater Noida, Uttar Pradesh 201306, India · hello@loyalties.space

Nothing playing. Choose a book to read or listen.